|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

RRB: రైల్వేలో 1,688 ఉద్యోగాలకు అప్లై చేశారా? గడువు త్వరలోనే ముగుస్తుంది!

హైదరాబాద్, సూర్య న్యూస్ : భారతీయ రైల్వేలో (Indian Railways) ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఆధ్వర్యంలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC-UG) విభాగంలో మొత్తం 1,688 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 13వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 72 ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థులను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-1, CBT-2) ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతల గురించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp