|  
● FLASH NEWS
HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  •  Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్  • 
Skip to content

Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్

పులివెందుల, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో తాను ఓటు వేయబోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) సంచలన ప్రకటన చేశారు. న్యాయంగా, ధర్మంగా రీపోలింగ్ నిర్వహిస్తేనే అప్పుడొచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

పులివెందులలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ వాస్తవం ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతోనే తాను ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్ తెలిపారు. తాను ఓటు వేస్తే పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నాయని అందరూ భావిస్తారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

జగన్ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పందించింది. పులివెందుల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ పుణేరా స్పష్టం చేశారు. రీపోలింగ్ నిర్వహించాలంటే ఇవాళే ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని, కలెక్టర్, ఎస్పీ ఇచ్చే నివేదిక ఆధారంగా దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp