|  
● FLASH NEWS
Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  •  Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్  •  YSRCP: కూటమి పాలనలో ధరల మంట.. బాదుడే బాదుడన్న జగన్  •  TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  • 
Skip to content

Anantapur: పెళ్లికి నిరాకరించిందని టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి!

అనంతపురం, సూర్య న్యూస్ : అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ ఉన్మాది పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై (10th Student Attack) తరగతి గదిలోనే చెట్లు కోసే రంపంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

స్థానికుల వివరాల ప్రకారం.. నిందితుడు హేమంత్ బాధితురాలికి వరసకు బాబాయ్ అవుతాడు. నిందితుడి సోదరిని బాలిక మేనమామకు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలంగా బాలికను పెళ్లి చేసుకుంటానని హేమంత్ వెంటపడుతుండగా, కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించారు. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు, రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ (ZPHS) తరగతి గదిలో ఉన్న విద్యార్థినిపై చెట్లు కోసే మిషన్‌తో దాడికి పాల్పడ్డాడు. నిందితుడు మద్యం, గంజాయికి బానిస అని, గతంలోనూ ఓ హాస్టల్‌లోకి చొరబడి విద్యార్థులపై దాడికి యత్నించాడని స్థానికులు చెబుతున్నారు.

విద్యార్థినిపై జరిగిన దాడి పట్ల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. “చిన్నారి చెల్లిని క్లాస్‌రూమ్‌లో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు.. గుండె బరువెక్కింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్మాదులను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఆడపిల్లల వైపు చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మేజర్ బ్లీడింగ్‌ను వైద్యులు కంట్రోల్ చేశారని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp