|  
FLASH NEWS
Jio Network Issue : సిగ్నల్ రావడం లేదని వినూత్న నిరసన.. టెలికాం ఉద్యోగిని ఏకంగా టవర్‌కే కట్టేసిన గ్రామస్తులు!  •  KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  •  BRICS Summit 2026 : ‘మంచివారితోనే స్నేహం.. చెడ్డవారితో వద్దు’.. బ్రిక్స్ వేళ మోదీ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి?  •  KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  • 
Skip to content

10th Class Student Suicide : భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువే కామాంధుడిగా మారితే.. కీచక టీచర్ వేధింపులకు బాలిక బలి!

కళ్లకురిచి, సూర్య న్యూస్ : భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారడంతో ఓ పదో తరగతి విద్యార్థిని (10th Class Student) బలవన్మరణానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులో (Tamil Nadu) చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక కళ్లకురిచి జిల్లాలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యావ్యవస్థను, సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కళ్లకురిచి జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు జగదేశన్ ఆమెను లైంగికంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడేలా పరిస్థితి కల్పించాడు. ఈ రాక్షస వేధింపుల గురించి ఎవరికీ చెప్పుకోలేక ఆ విద్యార్థిని తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు ఆ మానసిక క్షోభను భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా ఉపాధ్యాయుడు జగదేశన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం నిందితుడు బాలికను లైంగికంగా వేధించినట్లు రుజువైంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కామాంధుడిగా మారిన ఆ కీచకుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రజాసంఘాలు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన

పాఠశాలలో భద్రత కరువై, ఉపాధ్యాయుడి చేతిలోనే విద్యార్థినికి రక్షణ లేకుండా పోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై నేరాలు నిత్యకృత్యంగా మారాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ స్పందించారు. రాష్ట్రంలో హత్యలు, కస్టడీ మరణాలు, పరువు హత్యలు పెరుగుతున్నాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రతి నేరాన్ని శాంతిభద్రతల సమస్యగా పరిగణించకూడదని ఆయన బదులిచ్చారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp