|  
FLASH NEWS
Rahul Gandhi Comments : లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!  •  NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  •  Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!  •  Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  • 
Skip to content

Amulya Sri Suicide : షాకింగ్.. బాత్రూంలో రహస్య కెమెరాలు.. నగ్న వీడియోలతో వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న యువ నటి!

హైదరాబాద్, సూర్య న్యూస్ : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. షార్ట్ ఫిల్మ్ నటి (Short Film Actress) అమూల్య శ్రీ (Amulya Sri) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. సైదాబాద్ (Saidabad) పరిధిలోని సింగరేణి కాలనీలో (Singareni Colony) ఈ దారుణం జరిగింది. స్థానికంగా ఉండే కొందరు యువకుల వేధింపులు తట్టుకోలేక ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.

Amulya Sri Suicide : 6 నెలలుగా నరకయాతన..

పోలీసుల నిర్లక్ష్యం..​స్థానికంగా ఉండే కొందరు యువకులు అమూల్య శ్రీకి సంబంధించిన వ్యక్తిగత బాత్రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. ఈ నగ్న వీడియోలు (Nude Videos) చూపిస్తూ గత ఆరు నెలలుగా ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. తమ కోరిక తీర్చడానికి తమ దగ్గరికి రావాలని వారు ఆమెను బెదిరించారు. లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియా (Social Media) వేదికగా వైరల్ చేసి కెరీర్ ను నాశనం చేస్తామని నిరంతరం బ్లాక్ మెయిల్ (Blackmail) చేశారు. పరువు పోతుందనే భయంతో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ వేధింపులు మితిమీరడంతో అమూల్య శ్రీ సూసైడ్ కు ముందే సైదాబాద్ పోలీసులను (Saidabad Police) ఆశ్రయించింది. అయితే బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించలేదని కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని అమూల్య తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఈ దారుణ ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా ప్రధాన నిందితులను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాదిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి అమూల్య సూసైడ్ లెటర్ ను (Suicide Note) స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp