రిపోర్టర్: Sr. Reporter Prasad

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా రేపు పలు జిల్లాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ముఖ్యమైన ఆరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి చిరుజల్లులు పడతాయని పేర్కొన్నారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు, కాలువలతో పాటు మునిగిపోయిన కాజ్‌వేలను దాటే సాహసం చేయరాదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



