
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి మెగా, అల్లు కుటుంబాలకు (Mega Family) చెందిన హీరోలంతా హాజరై ప్రత్యేకంగా సందడి చేశారు.
ఈ వేడుకలో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ తదితరులు పాల్గొని కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించారు. మెగా హీరోలంతా కలిసి దిగిన ఓ గ్రూప్ ఫోటోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ కొత్త జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 10వ తేదీన సాయిధరమ్ తేజ్, కిరణ్మయిల వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత మెగా కుటుంబ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



