|  
FLASH NEWS
Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  • 
Skip to content

విజయ్-రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన వధూవరులను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి నేరుగా విజయ్ దేవరకొండ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు పూలబొకే అందజేసి ఆశీర్వదించిన సీఎం, అనంతరం విజయ్ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు సరదాగా గడిపారు.

ముఖ్యమంత్రి రాకపై విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తమ ఇంటికి వచ్చి ఆశీర్వదించినందుకు ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఫోటోలను షేర్ చేశారు. అంతకుముందు రష్మిక మందన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిసి తమ వివాహ వేడుకకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2018లో ‘గీత గోవిందం’ చిత్రంతో తొలిసారి వెండితెరపై జంటగా కనిపించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాకుండా వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2019లో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోనూ కలిసి నటించిన ఈ జంట, అప్పటి నుండి స్నేహంగా ఉంటూ చివరకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం సీఎం పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp