|  
● FLASH NEWS
HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  •  Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్  • 
Skip to content

HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం

హైదరాబాద్, సూర్య న్యూస్ : నగరంలో తాగునీరు, భూగర్భ జలాలను ఆదా చేసే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా భవన నిర్మాణాలు, గార్డెనింగ్ అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ‘గ్రీన్ వాటర్ ట్యాంకర్’ (Green Water Tankers) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మొదటి దశలో భాగంగా 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) నుంచి ఈ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు 28 ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ గ్రీన్ ట్యాంకర్లకు జీపీఎస్ (GPS), ఈ-పాస్ సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. ప్రజలు పొరపాటు పడకుండా ఉండేందుకు, ఈ ట్యాంకర్ల మీద ‘తాగునీరు కాదు’ అని స్పష్టంగా ముద్రిస్తామని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం తొలిదశలో ప్రారంభమైన ఈ గ్రీన్ ట్యాంకర్ల సేవలను త్వరలోనే నగరమంతటా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా నిర్మాణాలకు వాడే భారీ స్థాయి తాగునీటిని ఆదా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp