|  
FLASH NEWS
Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  • 
Skip to content

ప్రగతి నగర్ తాగునీటి సమస్యపై యుద్ధం ప్రకటించిన కాంగ్రెస్! అధికారులను కలవనున్న కొలన్ హన్మంత్ రెడ్డి!

హైదరాబాద్, సూర్య న్యూస్ :కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ డివిజన్ (276)లో దశాబ్ద కాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యపై శాశ్వత పరిష్కారం కోరుతూ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజల ఇబ్బందులను తాను గమనిస్తున్నానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. వెంటనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఎండీతో పాటు సంబంధిత అధికారులతో చర్చించి, ప్రగతి నగర్ ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్ రావు, మురళీకృష్ణ, నారాయణ రెడ్డి, సురేంద్ర కుమార్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఆది రెడ్డి, మహేష్, మధుసూదన్ రెడ్డి, రఫత్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp