|   
🔴 BREAKING NEWS ► Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ల రికార్డ్, ఖాతాలో మరో రెండు స్వర్ణాలు BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే
Skip to content

Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ల రికార్డ్, ఖాతాలో మరో రెండు స్వర్ణాలు

Indian Boxers Shine, Add Two More Golds : స్కాట్లాండ్ లో గ్లాస్గో (Glasgow) వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ (Boxing) విభాగంలో మన బాక్సర్లు పతకాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళల విభాగంలో పలువురు బాక్సర్లు స్వర్ణ పతకాలు (Gold Medals) సాధించారు. తాజాగా పురుషుల విభాగంలో మరో ఇద్దరు బాక్సర్లు భారత్ ఖాతాలో బంగారు పతకాలను జమ చేశారు.

​పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంఘాల్ (Ankush Panghal) అద్భుతమైన ఆటతీరుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ (Sachin Siwach) కూడా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఈ గేమ్స్ లో బాక్సింగ్ విభాగంలోనే భారత్ ఇప్పటివరకు మొత్తం ఏడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ వరుస విజయాలతో బాక్సింగ్ రింగ్ లో భారత్ (India) తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

మహిళల విభాగంలో ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ముంఫాస్, అరుంధతి చౌదరి (Arundhati Chaudhary) ఇప్పటికే స్వర్ణాలు సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. అయితే 75 కేజీల విభాగం ఫైనల్ కు చేరిన స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) తుది పోరులో ఓటమి పాలైంది. ఆమె రజత పతకంతో (Silver Medal) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కామన్వెల్త్ వేదికగా భారత బాక్సర్ల ప్రదర్శన క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp