
హైదరాబాద్, సూర్య న్యూస్ : గాజులరామారంలోని (Gajularamaram) శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్ధి పీఠం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవ (Koti Deepotsavam) కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కేకేఎం ట్రస్ట్ చైర్మన్, మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు.

కార్తీక దీపారాధనకు ఎంతో విశిష్టత
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉందని శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాలను, సంస్కృతిని భావితరాలకు అందిస్తాయని తెలిపారు. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సత్కారం
అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోటి దీపోత్సవ నిర్వాహకులతో పాటు స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, పున్నారెడ్డి, బాలప్ప, అంజి రెడ్డి, యం సాగర్, దంపబోయిన శ్రీనివాస్, రాజిరెడ్డి, గుబ్బల రమణ, సంతోష్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



