|  
● FLASH NEWS
Konaseema: తెల్లవారుజామున పెద్ద శబ్దం.. గ్రామస్తులు ఎందుకు ఇళ్లు ఖాళీ చేశారో తెలుసా?  •  Akvan: నవంబర్ 20న ఆంధ్ర తీరం దాటనున్న అక్వాన్ తుపాను.. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్  •  Quad: మనీలాలో క్వాడ్ సమావేశం.. మోదీని ‘చాలా గట్టివాడు’ అని ప్రశంసించిన ట్రంప్  •  Dhoni: ఐపీఎల్ ఆటకు ధోని వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మార్గదర్శకుడిగా మహి  •  Charlapalli Fire: కరెంట్ కనెక్షనే లేని బోగీలో మంటలు ఎలా?.. చర్లపల్లి స్టేషన్‌లో భయానక అగ్నిప్రమాదం  • 
Skip to content

Mahabubabad: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహిళా మండల అధ్యక్షుల నియామకం

మహబూబాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం (Telangana Gouda Sangam) మహిళా విభాగం పలు మండలాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని మూడు మండలాలకు చెందిన మహిళా నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు.

మరిపెడ మండలం చిన్న గండికి చెందిన సుజాత గౌడ్, తొర్రూర్ మండలానికి చెందిన బొమ్మగాని లక్ష్మి గౌడ్, పెద్దవంగర మండలానికి చెందిన అనేపురం ఏలేంద్ర గౌడ్‌లను ఆయా మండలాల అధ్యక్షులుగా నియమించారు. సోమవారం మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో.. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా మహిళా అధ్యక్షురాలు గండి శారద గౌడ్, సర్పంచ్ గండి రాధమ్మ గౌడ్ చేతుల మీదుగా వీరికి నియామక పత్రాలు అందజేశారు.

నూతన మండల మహిళా అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేస్తున్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులు
నూతన మండల మహిళా అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేస్తున్న తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులు

ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ.. బాధ్యతలు స్వీకరించిన నూతన అధ్యక్షులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గండి శోభన్ గౌడ్, గండి మహేష్ గౌడ్, గండి ఉపేందర్ గౌడ్, రవి గౌడ్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp