|  
● FLASH NEWS
Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  • 
Skip to content

Gouda: రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నర్సింగ్ గౌడ్.. నూతన బాధ్యతలు అప్పగింత

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం (Telangana Gouda Samkshema Sangham) విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా మరియు పలు డివిజన్ల పరిధిలో నూతన నాయకులను నియమించారు. ఫిలింనగర్‌లోని సంఘం కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు చేతుల మీదుగా నూతన బాధ్యులకు అధికారికంగా నియామక పత్రాలు అందజేశారు.

నూతనంగా నియమితులైన నాయకులు

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నర్సింగ్ గౌడ్, బాలాపూర్ మండల అధ్యక్షుడిగా రాజేష్ గౌడ్ నియమితులయ్యారు. అలాగే, పహాడీ షరీఫ్ డివిజన్ అధ్యక్షుడిగా దూడల సురేష్ గౌడ్, షాహీన్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా దూడల మధు గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పరుచూరి సురేష్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంఘం పటిష్టతకు కృషి చేయాలి

ఈ నియామక కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు పరుచూరి సురేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు దూడల సుధాకర్ గౌడ్, నిజాంపేట అధ్యక్షుడు సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులకు సంఘం పెద్దలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా డివిజన్ల పరిధిలో గౌడ సోదరుల సంక్షేమానికి, సంఘం పటిష్టతకు అందరూ సమష్టిగా, ముందుండి విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp