
ముంబై, సూర్య న్యూస్ డెస్క్ : భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) మూవీకి పైరసీ (Piracy) ముప్పు పొంచి ఉంది. బిగ్ స్క్రీన్‌పై సినిమా ప్లే అవుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు సీన్లను తమ మొబైల్స్‌లో రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో (Social Media) విచ్చలవిడిగా లీక్ చేస్తున్నారు. ఇలా లీక్డ్ క్లిప్స్ (Leaked Clips) ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడంపై చిత్ర నిర్మాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న మేకర్స్, పైరసీకి పాల్పడే వారిపై కఠినమైన లీగల్ యాక్షన్ (Legal Action) తీసుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ముందస్తు నోటీసులు లేకుండానే క్రిమినల్ కేసులు
ఈ మేరకు చిత్రబృందం తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఎక్స్ (X) ఖాతాల ద్వారా ఒక లీగల్ నోటీస్‌ను షేర్ చేసింది. థియేటర్ల లోపల రికార్డ్ చేసిన వీడియోలను వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఇలాంటి క్లిప్స్ అప్‌లోడ్ చేసిన వారు వెంటనే వాటిని డిలీట్ చేయాలని స్పష్టం చేసింది. కాపీరైట్ యాక్ట్ 1957 (Copyright Act, 1957), సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 (Cinematograph Act, 1952), బీఎన్ఎస్ 2023, ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సినిమా క్లిప్పింగ్స్ రికార్డ్ చేయడం లేదా షేర్ చేయడం తీవ్రమైన నేరమని పేర్కొంది. ఇది క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తుందని, ఇలాంటి పనులకు పాల్పడితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడుతుందని హెచ్చరించింది. ఇన్‌పై ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే నేరుగా క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటామని మేకర్స్ తేల్చిచెప్పారు.
బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నిజానికి సినిమా రిలీజ్ కాకముందే పైరసీ నుంచి రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court) ఒక మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది. గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ కంపెనీ దాఖలు చేసిన కాపీరైట్ పిటిషన్‌పై జస్టిస్ మాధవ్ జమ్‌దార్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ సంస్థకే భారత్‌తో పాటు ఓవర్సీస్‌లో (Overseas) రామాయణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఉన్నాయి. గుర్తింపు లేని వ్యక్తులు లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అనుమతి లేకుండా కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడంపై కోర్టు స్టే విధించింది. కంప్లైంట్ రాగానే అలాంటి పైరేటెడ్ కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి గూగుల్ (Google) వంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా అంగీకరించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



