
గ్లాస్గో (Glasgow), సూర్య న్యూస్ :గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) క్రీడలు ముగిశాయి. జూలై 23 నుంచి మొదలైన ఈ పోటీల్లో భారత (India) క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు (Medals) చేరాయి. మొత్తం 39 మెడల్స్ సాధించి ఓవరాల్ పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియా (Australia) 158 పతకాలతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇంగ్లాండ్ (England) 102 పతకాలతో రెండో స్థానం దక్కించుకుంది. కెనడా (Canada) 59 పతకాలతో మూడో స్థానంలో ఉంది. 2022 బర్మింగ్ హామ్ (Birmingham) గేమ్స్ లో కూడా భారత్ నాలుగో స్థానంలోనే నిలిచింది. అప్పుడు 61 పతకాలు రాగా, ఈసారి ఆ సంఖ్యలో 60 శాతం పతకాలు మాత్రమే దక్కాయి.
పోటీల్లో ఆఖరి రోజైన ఆగస్టు 1న భారత బాక్సర్లు (Indian Boxers) ఏకంగా ఏడు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించారు. మహిళల విభాగంలో ప్రీతి పన్వార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ గంగాస్, అరుంధతి చౌదరి గోల్డ్ మెడల్స్ (Gold Medals) గెలిచారు. అథ్లెటిక్స్ లో సోమన్ రానా కూడా స్వర్ణం సాధించాడు. లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) తో సహా మరికొందరు రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 2030 కామన్వెల్త్ గేమ్స్ కి (2030 Commonwealth Games) ఆతిథ్యం ఇవ్వబోయే భారత్ కి జ్యోతిని అందించారు. 2030లో అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




