|  
● FLASH NEWS
Balapur: బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డ్.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన ప్రసాదం  •  ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో పతకం ఖాయం!  •  Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  • 
Skip to content

Balapur: బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డ్.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన ప్రసాదం

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ లడ్డూ (Balapur Ganesh Laddu) వేలంలో ఈ ఏడాది కొత్త రికార్డ్ నమోదైంది. తీవ్ర పోటీ మధ్య జరిగిన ఈ వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలకు పాడుకుని లడ్డూను దక్కించుకున్నారు.

బ్రేక్ అయిన గతేడాది రికార్డు

గతేడాది జరిగిన వేలంలో బాలాపూర్ లడ్డూ అత్యధికంగా రూ.35 లక్షలు పలికింది. అయితే ఈ ఏడాది ఆ రికార్డు బద్దలై ఏకంగా రూ.39 లక్షలకు చేరుకోవడం విశేషం. వేలంలో విజేతగా నిలిచిన సామా ప్రణీత్ రెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు వినాయకుడి లడ్డూను లాంఛనంగా అందజేశారు.

అభివృద్ధి, సేవా పనులకు నిధులు

ఈ ప్రతిష్టాత్మక లడ్డూ వేలం ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని సద్వినియోగం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. బాలాపూర్ ప్రాంతంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులతో పాటు, ఆలయాల పరిరక్షణ మరియు ఇతర సేవా కార్యక్రమాల కోసం ఈ డబ్బును వినియోగించనున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp