|   
🔴 BREAKING NEWS ► PM Modi Latest Video : మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు Police Job Aspirant Arrested : నిరుద్యోగుల బంద్ ఎఫెక్ట్.. హాస్టల్ వద్దే పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ అరెస్ట్ Delhi Police Warning : ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసుల సంచలన వార్నింగ్.. ఆ తప్పు చేశారో ఇక మీ పాస్‌పోర్ట్ రద్దే Nandamuri Balakrishna Knee Surgery : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య మోకాలి ఆపరేషన్ సక్సెస్
Skip to content

Hyderabad Water Master Plan : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ నీటి కష్టాలకు చెక్, సీఎం సంచలన నిర్ణయం

హైదరాబాద్, సూర్య న్యూస్: క్యూర్ (CURE) పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ (Master Plan) రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా ఈ ప్లాన్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ (Hyderabad) మహానగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ (GHMC), మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు విలీన ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఏకరూపత తీసుకురావాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం ఉన్నందున తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

నగర శివారులోని తాగునీటి వనరులను (Water Resources) ఒకదానితో ఒకటి అనుసంధానించాలని చెప్పారు. దీని ద్వారా ఒక సోర్స్ నుంచి నీరు రాకపోయినా మరో సోర్స్ ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేయవచ్చని వివరించారు. నగరంలో ప‌లు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు (Drinking Water) సరఫరా చేసే పరిస్థితి ఇకపై ఉండకూడదని ఆయన అధికారులను హెచ్చరించారు. తప్పనిసరిగా రోజు విడిచి రోజు నీరు అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఏడాదిన్నర లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక డ్యాష్‌బోర్డు (Dashboard) ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలు, నిర్మాణాలకు గ్రే వాటర్ వాడేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం (Chief Minister) అధికారులకు తేల్చిచెప్పారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp