
హైదరాబాద్, సూర్య న్యూస్ : పల్లెటూరి జానపద పాట ‘జిమ్ జిమ్ తార’ పాట కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నారని ప్రముఖ జానపద గాయని లక్ష్మి (Singer Lakshmi) చిత్ర యూనిట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాదాపు 10 సెకన్ల పాటు ఈ పాటను సినిమాలో ఉపయోగించారని, దీనిపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
“పర్ణశాల మూవీ టీమ్‌కు గానీ, నాకు గానీ మీరు డబ్బులు ఇచ్చారా? ఎవరిని అడిగి ఆ పాట సినిమాలో పెట్టుకున్నారు? వెంటనే ఆ పాటను సినిమా నుంచి తొలగించాలి. లేదంటే ఈ వ్యవహారం కేసుల దాకా వెళ్తుంది” అని సింగర్ లక్ష్మి ఓ వీడియో ద్వారా చిత్ర బృందాన్ని ప్రశ్నించారు. పల్లెటూళ్లలో ఎవరూ పిచ్చోళ్లు లేరని, తమ హక్కుల గురించి తమకు తెలుసునని ఆమె ఘాటుగా స్పందించారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



