
అశ్వారావుపేట, సూర్య న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేసప్పగూడెం గ్రామంలోని కే.సీ.ఆర్ కాలనీలో వరద (Flood Relief) బాధిత కుటుంబాలకు మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. భారీ వర్షాలతో కాలనీలోని ఇళ్లు నీట మునగడంతో సుమారు 25 కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి.

వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు, ఇతర సామగ్రి తడిసిపోయాయి. దీంతో కాలనీవాసులు నిత్యావసరాల కోసం అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాసాని చంద్రమోహన్–పద్మ దంపతులు, డా. భూక్యా ప్రసాద్–డా. ఉదయ జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో 25 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. కష్టకాలంలో బాధితులకు అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కేసప్పగూడెం సర్పంచ్ సోడెం భారతి, వార్డు సభ్యులు కొవ్వసి భారతి, సోయం వెంకటమ్మ, సున్నం పార్వతి, వేదాంతపురం సర్పంచ్ సోడెం ముత్యాలరావు, పిల్లెం బొత్తయ్య, సొంధెం ముత్యాలరావు, సొంధెం కృష్ణ, వేదాంతపురం మాజీ సర్పంచ్ సోమిని శివశంకర్ ప్రసాద్, అశ్వారావుపేట టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, గూడవర్తి వెంకటేశ్వరరావు, జజ్జురపు శ్రీరామమూర్తి, తగరం జగన్నాథం, శెట్టిపల్లి రఘురామ్, జక్కం బలరామకృష్ణ, రాజనాల గంగాధర్, మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



