
హైదరాబాద్, సూర్య న్యూస్ : హీరో రవితేజ (Ravi Teja) నటించిన ‘ఇరుముడి’ సినిమా (Irumudi Movie) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో రవితేజ మాట్లాడుతూ.. ఈ మూవీ తనకెంతో గర్వకారణమని, నటుడిగా తనకు పూర్తి స్థాయి సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
సినిమా గురించి ప్రేక్షకులు, అభిమానులు గొప్పగా చెబుతుంటే తనకు చాలా సంతోషంగా ఉందని, మనసు పొంగిపోతోందని రవితేజ అన్నారు. తనకు నటుడిగా ఇంత మంచి పేరు రావడానికి, చిత్రం ఘన విజయం సాధించడానికి పూర్తి క్రెడిట్ దర్శకుడు శివ నిర్వాణదే అని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడి అంకితభావం వల్లే ఈ చిత్రం ఇంతటి భారీ సక్సెస్‌ను అందుకుందని ప్రశంసించారు.
మైత్రీ బ్యానర్‌కు కిరీటం లాంటిది
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సక్సెస్ వేడుకలో నిర్మాత రవి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తమ నిర్మాణ సంస్థ ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించిందని, వాటన్నింటిలోనూ ‘ఇరుముడి’ తమ బ్యానర్‌కు ఒక కిరీటం లాంటిదని గర్వంగా చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



