రిపోర్టర్: Shanker

ఉడతలపల్లి, సూర్య న్యూస్. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును లబ్ధిదారుడికి కాంగ్రెస్ నాయకులు అందజేశారు. నీలకంఠం దశరథ అనే స్థానికుడికి మంజూరైన రూ. 24,000 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. మాజీ మండల పార్టీ అధ్యక్షులు కోరిమి ఓంకారం చేతుల మీదుగా ఈ చెక్కును అందించారు.
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉడతలపల్లి సర్పంచ్ కావలి శివాని సురేష్ మరియు మాజీ ఉపసర్పంచ్ గంట తులసయ్య ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుషిపాక శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పగడాల నాగరాజు, కావాలి మారయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



