|  
FLASH NEWS
YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  •  పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు విజృంభణ.. చుక్కలు చూపించిన తెలుగు తేజం శ్రీచరణి  • 
Skip to content

రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…

భేషజాలకు బ్రేక్…

నకిరేకల్‌ సభలో ఆత్మీయ పలకరింపులు..

త్వరలో మంత్రివర్గ విస్తరణ.. అందుకేనా ఈ వ్యూహాత్మక అడుగులు?

నకిరేకల్ (సూర్య న్యూస్ తెలుగు): నిన్నటి దాకా సొంత ప్రభుత్వంపై అసమ్మతి రాగాలు.. సీఎం సీటు నాదేనంటూ సంచలన వ్యాఖ్యలు.. కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో యూటర్న్ తీసుకున్నారు. నకిరేకల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభలో ఆయన వ్యవహరించిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత సభలకు ముఖం చాటేసిన ఆయన.. తాజా సభకు మాత్రం తన నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనసమీకరణ చేశారు. అనుచరగణంతో కలిసి భారీ కాన్వాయ్‌లో నకిరేకల్‌కు చేరుకున్న ఆయన వేదికపై సీఎం రేవంత్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఎంతో చనువుగా, ఎలాంటి భేషజాలకు పోకుండా ఆప్యాయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

a6896533 abb9 4f8a 9aa5 59a3476340eb

వేదికపై గుసగుసలు.. మార్మోగిన కరతాళ ధ్వనులు!

సభా వేదికపైనా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా కూర్చున్న రాజగోపాల్ రెడ్డి.. ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ కనిపించారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తమ ప్రసంగాల్లో రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడల్లా సభలో జనాల నుంచి భారీ స్పందన, కరతాళ ధ్వనులు మార్మోగాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డిని “మీ అందరి ప్రియతమ నాయకుడు” అని అభివర్ణించడంతో రాజగోపాల్ రెడ్డి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.

అంతా ఓకే.. బెర్త్ కన్ఫర్మ్ అయ్యేనా?

1721280c 062c 4bb6 b178 d4a2f1889920

సభ ముగిసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “నాకు, ముఖ్యమంత్రికి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.. మేమంతా కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాం” అని స్పష్టం చేశారు. దీంతో నిన్నటి దాకా కొంత గందరగోళానికి గురైన మునుగోడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా నూతన ఉత్సాహం ఉప్పొంగింది. మొన్నటి దాకా వివాదాస్పద వ్యాఖ్యలతో హీట్ పెంచిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు ఇంత సానుకూలంగా మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ హఠాత్ పరిణామాల వెనుక అసలు కథ వేరే ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకే ఆయన వ్యూహాత్మకంగా సానుకూల ధోరణిలోకి వచ్చారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొత్తానికి నకిరేకల్ సభతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp