|  
FLASH NEWS
BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  •  Botsa Satyanarayana Cry: చీపురుపల్లిలో బోరుమన్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల ముందే భావోద్వేగం!  •  Bank Strike: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో మీరే తెలుసుకోండి..  •  Kaloji Narayana Rao Jayanthi: ఎదిరించిన అక్షరాయుధం.. తెలంగాణ భాషా దినోత్సవం వేళ ప్రజాకవి కాళోజీ సమగ్ర స్మరణ  • 
Skip to content

AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్

Chandra babu naidu warning sand mafia
Chandra babu naidu warning sand mafia

కోనసీమ, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం (Liquor), ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కోనసీమ జిల్లా మాచవరంలో జరిగిన ఒక సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎవరైనా ఎంఆర్పీకి మించి మద్యం విక్రయిస్తే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా కూడా ఇసుక కొరత రాకుండా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులకు ఆయన సూచించారు.

2027 నాటికి భూ సమస్యల పరిష్కారం

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. 2027 మార్చి నాటికి రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పటిష్టంగా భూముల రీసర్వే చేపడుతున్నామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp