|  
FLASH NEWS
BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  •  Botsa Satyanarayana Cry: చీపురుపల్లిలో బోరుమన్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల ముందే భావోద్వేగం!  •  Bank Strike: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో మీరే తెలుసుకోండి..  •  Kaloji Narayana Rao Jayanthi: ఎదిరించిన అక్షరాయుధం.. తెలంగాణ భాషా దినోత్సవం వేళ ప్రజాకవి కాళోజీ సమగ్ర స్మరణ  • 
Skip to content

CM Chandrababu Naidu: ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే అభివృద్ధి ఆగినట్టే.. అమరావతిపై సీఎం కీలక వ్యాఖ్యలు

AP CM chandra babu naidu
AP CM chandra babu naidu

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే అభివృద్ధి, పాలన ఆగిపోయినట్లేనని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతి (Amaravati) రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు మరింత మెరుగైన వెర్షన్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు పరిపాలనాపరమైన అంశాలను ప్రస్తావించారు. గతంలో యాభై ఏళ్లలో చేసే అభివృద్ధిని ప్రస్తుతం పది నుంచి పదిహేనేళ్లలోనే సాధించే ఆస్కారం ఉందని చెప్పారు. అధికారులు కేవలం సమస్య వచ్చిన తర్వాత స్పందించే రియాక్టివ్ గవర్నెన్స్ విధానాన్ని వీడి, ముందుచూపుతో వ్యవహరించే ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అందించాలని సూచించారు.

రాష్ట్రంలో వనరులు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలనలో వేగం పెంచాలని మరియు ప్రతి ఫైలును సకాలంలో పరిష్కరించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp