
హైదరాబాద్, సూర్యా న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోవడం లేదని, ఆ మొత్తాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో పేదలకు ఇళ్లు కట్టుకోవడం కష్టంగా మారిందని ఆయన వివరించారు.
ఇంటి నిర్మాణం కోసం కేవలం మేస్త్రీలకే రూ. 3 నుంచి 4 లక్షలు తీసుకుంటున్నారని, మెటీరియల్ ధరలు కూడా పెరగడంతో ఒక ఇల్లు పూర్తి కావాలంటే రూ. 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతోందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆటోలు, ట్రాక్టర్లు ఉన్నాయనే కారణంతో కొందరు నిరుపేదలను ఈ పథకానికి ఎంపిక చేయలేదని, అలాంటి నిబంధనలను తక్షణమే సడలించి పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



