
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు చూస్తుంటే షాక్ కొడుతున్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదలపై మండిపడుతూ ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టర్ విడుదల చేశారు.
బియ్యం, వంటనూనెలు, కందిపప్పు, చక్కెర లాంటి నిత్యావసర వస్తువులతో పాటు కరెంట్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఇలా అన్నీ పెంచేసి ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నారని జగన్ ఆరోపించారు. “ధరలతో బాదుడే బాదుడు” అంటూ ప్రస్తుత ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.
2024లో తన ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలను, 2026లో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పెరిగిన ధరలను పోల్చుతూ వైఎస్ జగన్ ఒక పట్టికను విడుదల చేశారు. ఇందులో బియ్యం ధర 70%, వంటనూనె ధరలు 72-94%, ఉల్లిపాయల ధరలు ఏకంగా 433%, టమాట ధరలు 175% పెరిగాయని ఆ పట్టిక ద్వారా వివరించారు. పాలు, గుడ్లు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



