|  
● FLASH NEWS
YSRCP: కూటమి పాలనలో ధరల మంట.. బాదుడే బాదుడన్న జగన్  •  TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  •  10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!  •  Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  • 
Skip to content

Voting: రేపే మున్సిపల్ పోలింగ్.. బ్యాలెట్ పేపర్‌తో ఓటు ఎలా వేయాలి?

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ బ్యాలెట్ పేపర్ (Ballot Paper) విధానంలో జరగనుండటంతో ఓటు వేసే విధానంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు.

బ్యాలెట్ పేపర్‌పై ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఓటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాలెట్ పేపర్‌లోని పార్టీ లేదా అభ్యర్థి పేరు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మాత్రమే స్వస్తిక్ ముద్రను వేయాలి. ముద్ర వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్‌ను నేరుగా బాక్సులో వేయకుండా మడతపెట్టే విధానంలో కచ్చితమైన నియమాలు పాటించాలి.

ఓటరు ముద్ర వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్‌ను తొలుత నిలువుగా మడవాలి. ఆ తర్వాతే దానిని అడ్డంగా మడతపెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాలి. ఇలా చేస్తేనే ఆ ఓటు పూర్తిస్థాయిలో వాలిడ్ (చెల్లుబాటు) అవుతుంది.

అలా కాకుండా ఓటర్లు పేపర్‌ను నేరుగా అడ్డంగా మడత పెడితే, స్వస్తిక్ ముద్రపై ఉన్న ఇంక్ పక్కనే ఉన్న మరో అభ్యర్థి గడిలో పడే ప్రమాదం ఉంది. దీనివల్ల సదరు ఓటు ఇన్‌వాలిడ్ అయ్యే అవకాశం ఉన్నందున ఈ మడత ప్రక్రియను సరిగ్గా పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp