
హైదరాబాద్, సూర్య న్యూస్ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20 (IND vs NZ 4th T20) మ్యాచ్‌లో టీమిండియాపై (Team India) కివీస్ 87 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్యఛేదనలో భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో కివీస్ 259 పరుగుల స్కోరు నమోదు చేసింది.
260 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నమన్ ధీర్ 28, అభిషేక్ శర్మ 27, శ్రేయస్ అయ్యర్ 22, నితీశ్ రెడ్డి 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్, మాథ్యూ ఫిషర్ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



