|  
● FLASH NEWS
YSRCP: కూటమి పాలనలో ధరల మంట.. బాదుడే బాదుడన్న జగన్  •  TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  •  10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!  •  Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  • 
Skip to content

N Balasubrahmanyam: సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత.. శోకసంద్రంలో పోలీస్ శాఖ

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజిత ఏపీలో విశేష సేవలు అందించిన సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS Officer) ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పోలీసు, పాలనా విభాగాలతో పాటు పలువురు ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు

1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం తన సుదీర్ఘ వృత్తి జీవితంలో రవాణా, సాంకేతిక, శాంతిభద్రతల విభాగాల్లో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో జగిత్యాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అప్పటి ఉమ్మడి కరీంనగర్ ఎస్పీ ఉమేష్ చంద్రతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, అక్రమ ఫైనాన్స్ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచి చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. అనంతరం 1998లో హైదరాబాద్ గ్రేహౌండ్స్ విభాగానికి బదిలీ అయ్యారు.

ఏపీలో కీలక శాఖల్లో సేవలు

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ కేడర్‌కు వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం అక్కడ కూడా అత్యంత బాధ్యతాయుతమైన పదవులు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా, ఇంటెలిజెన్స్ ఐజీగా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా ఆయన తనదైన ముద్ర వేశారు. ఏపీసీఎఫ్‌ఎంఎస్ సీఈవోగా, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈవోగా కూడా పనిచేశారు. ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. విధి నిర్వహణలో ఆయన కనబరిచిన నిబద్ధత అందరి మన్ననలు పొందింది.

ధైర్యశాలిని కోల్పోయామన్న డీజీపీ సీవీ ఆనంద్

బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 1996-99 మధ్య తాను నిజామాబాద్ ఎస్పీగా ఉన్న సమయంలో తన వద్ద బాలసుబ్రహ్మణ్యం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పనిచేశారని తెలిపారు. నక్సలైట్ల ఏరివేతలో ఆయన అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని, చాలా రిస్క్‌తో కూడిన ఆపరేషన్లలో పాల్గొన్నారని కొనియాడారు.

రెండు నెలల క్రితమే ఆయన అమెరికాలో వేరే చికిత్స కోసం వెళ్తున్నట్లు తనతో ఫోన్‌లో మాట్లాడారని సీవీ ఆనంద్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో పరిస్థితి విషమంగానే ఉన్నా కోలుకుంటారనే ఆశతో ఉండేవారని, అదే తమ చివరి ఫోన్ కాల్ అవుతుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆదర్శవంతమైన సహోద్యోగిని కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీవీ ఆనంద్ నివాళులర్పించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp