|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

Chiranjeevi: మెగావర్స్ ప్రోమోకు ఆ స్టార్ డైరెక్టర్.. చిరుతో సినిమా పక్కానా?

హైదరాబాద్, సూర్య న్యూస్ : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తొలిసారిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్న ‘మెగావర్స్’ (MegaVerse) టాక్ షోకి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే, ఈ ప్రతిష్టాత్మక షో ప్రోమోకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఈ ‘మెగావర్స్’ టాక్ షోను త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ ఈజ్ హియర్’ అంటూ నెట్‌ఫ్లిక్స్ చేసిన ట్వీట్ మెగా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ టాక్ షోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నారని, మొత్తం 12 నుంచి 15 ఎపిసోడ్స్ వరకు ఉంటాయని సమాచారం.

ఇక, దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. ఈ టాక్ షో ప్రోమో కోసం చిరంజీవి-హరీష్ శంకర్ కాంబినేషన్ కుదిరినట్లు తెలుస్తోంది. ఒకవేళ హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ ప్రోమో సక్సెస్ అయితే, భవిష్యత్తులో మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశాలు మరింత మెరుగవుతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp