|  
● FLASH NEWS
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  •  10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!  •  Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  •  Groundwater: తెలంగాణలో డేంజర్ బెల్స్.. 324 మండలాల్లో కరువు పరిస్థితులు  • 
Skip to content

MegaVerse: నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి టాక్ షో.. గెస్టులుగా పవన్, ప్రభాస్?

హైదరాబాద్, సూర్య న్యూస్ : మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో టాక్ షో హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ (MegaVerse) పేరుతో ఈ సెలబ్రిటీ టాక్ షో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే, ఈ షోకు టాలీవుడ్ అగ్ర హీరోలు (Star Heroes) గెస్టులుగా రాబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ ఈజ్ హియర్’ అంటూ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఈ షోను ప్రకటించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇప్పటికే ఈ టాక్ షో చిత్రీకరణ జరుగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 12 నుంచి 15 ఎపిసోడ్స్‌తో ఈ షోను ప్లాన్ చేశారని, త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

ఈ టాక్ షో గెస్ట్‌ల జాబితా నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ షోలో విశ్వనటుడు కమల్ హాసన్, బ్రహ్మానందం, సునీల్, సత్య వంటి ప్రముఖులు గెస్టులుగా పాల్గొని సందడి చేసినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే తదుపరి ఎపిసోడ్లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా గెస్టులుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే సినీ అభిమానులకు ‘మెగావర్స్’ కన్నుల పండుగగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp