
అనంతపురం, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన రాప్తాడు (Raptadu) ఘటనలో నిందితుడైన హేమంత్‌కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్‌లో హేమంత్ కుడి కాలును మోకాలి పైవరకు తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి ధృవీకరించారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్య బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ శస్త్రచికిత్స ప్రక్రియను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని వైద్య విభాగం వెల్లడించింది.
మరోవైపు, ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఉన్మాది హేమంత్పై పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం బాధితురాలిని చంపాలని యత్నించినందుకు BNS సెక్షన్ 101(1) కింద, అలాగే ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసినందుకు BNS సెక్షన్ 118(1) కింద కేసులు మోపారు. స్కూలులోకి అక్రమంగా ప్రవేశించి ఆయుధంతో దాడి చేసినందుకు ట్రెస్పాస్ కింద BNS సెక్షన్ 333 నమోదు చేశారు.
ఈ దాడిలో గాయపడిన మరో బాలిక ఎస్సీ వర్గానికి చెందినది కావడంతో, నిందితుడిపై SC, ST చట్టం సెక్షన్ 3(2)(V) కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కఠినమైన సెక్షన్ల కింద అభియోగాలు రుజువైతే నిందితుడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



