|  
● FLASH NEWS
PawanKalyan: మురసు తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు  •  Raptadu: రాప్తాడు ఉన్మాది హేమంత్ కాలు తొలగింపు.. కఠిన సెక్షన్లతో కేసు  •  Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  • 
Skip to content

Vijay: తన భుజంపై చేయి వేసిన వృద్ధురాలితో సీఎం విజయ్ సింప్లిసిటీ

చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Thalapathy Vijay) తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులూ గెలుచుకున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా, ఓ వృద్ధురాలు ఏకంగా సీఎం విజయ్ భుజంపై చేయి వేసి ఆప్యాయంగా పలకరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

ఆమె అలా చేసినా విజయ్ ఎలాంటి ఇబ్బంది పడకుండా, అంతే ఆప్యాయంగా ఆమెతో మాట్లాడుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. ఏమాత్రం హంగు, ఆర్భాటం లేకుండా ఒక సామాన్యుడిలా వ్యవహరించిన ముఖ్యమంత్రి తీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో ఎప్పుడూ కలుపుగోలుగా ఉండే విజయ్.. ఈ సంఘటనతో మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp