|  
FLASH NEWS
Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  •  హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్  •  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు  •  జాతీయ స్థాయి నృత్యోత్సవంలో హైదరాబాద్ విద్యార్థినుల సత్తా.. పతకాల పంట పండించిన కందుల నాట్యాలయ బృందం  •  నా చావు కోరుతూ సభకు రమ్మంటున్నారు : రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్.. అసెంబ్లీ వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం  • 
Skip to content

హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్

hardik pandya ameesha patel dating rumors
hardik pandya ameesha patel dating rumors

ముంబై, సూర్య న్యూస్ : టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) మధ్య వస్తున్న డేటింగ్ రూమర్స్‌కు ఆ నటి చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆమె.. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు.

ఇటీవల ముంబైలో జరిగిన ఓ పార్టీలో హార్దిక్ పాండ్యా భుజంపై అమీషా పటేల్ చేయి వేసి, తన స్నేహితులకు పరిచయం చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వారిద్దరి క్లోజ్‌నెస్ చూసిన ఓ నెటిజన్.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.

నెటిజన్ చేసిన ఈ కామెంట్‌పై అమీషా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా దీటుగా బదులిచ్చారు. “కరెక్టే.. అతడి భుజంపై నేను చేయి వేయడం చాలా రొమాంటిక్‌గా ఉంది. బహుశా నీకు ఫ్రెండ్‌గా అమ్మాయిలెవరూ లేకపోవచ్చు” అంటూ సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ఒకరి భుజంపై చేయి వేయడాన్ని రొమాంటిక్‌గా చూడటం సరికాదని హితవు పలికిన అమీషా.. తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని రూమర్స్‌కు ముగింపు పలికారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp