|  
● FLASH NEWS
BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  •  Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి  •  Netanyahu: ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని  •  HistoricWin: 406 పరుగుల రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన భారత్  •  PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  • 
Skip to content

BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?

పారిస్, సూర్య న్యూస్ డెస్క్ : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ (Eiffel Tower) సందర్శన సందర్భంగా తలెత్తిన వివాదంపై నగర పరిశీలన విభాగం (IGVP) విచారణ నివేదిక వెలువడింది. ఈ ఘటనలో ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక సంస్థ బీఏపీఎస్‌కు (BAPS) కొంత ఊరట లభించింది. మహిళా సిబ్బందిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని ఆ బృందం రాతపూర్వకంగా లేదా స్పష్టంగా కోరలేదని దర్యాప్తులో తేలింది.

ఫ్రాన్స్‌లో తొలి హిందూ దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న సుమారు 100 మంది బీఏపీఎస్ ప్రతినిధులు ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. ఆ సమయంలో మహిళా సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారని ఆరోపణలు రావడం, సిబ్బంది నిరసనతో టవర్‌ను ఒకరోజు మూసివేయడం, దీనిపై పారిస్ మేయర్ విచారణకు ఆదేశించడం తెలిసిందే.

కమ్యూనికేషన్ లోపంతోనే వక్రీకరణ

తాజా విచారణ ప్రకారం.. తమ బృందంలోని మతాధికారులకు, మహిళలకు మధ్య కేవలం భౌతిక స్పర్శ ఉండకూడదని మాత్రమే బీఏపీఎస్ ప్రతినిధులు మొదట అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థన టవర్ నిర్వహణ అధికారుల మధ్య మౌఖికంగా ప్రసారమవుతున్న క్రమంలో పూర్తిగా వక్రీకరణకు గురైంది. ఫలితంగా నిజంగానే కొంతమంది మహిళలను వారి పోస్టుల నుంచి తప్పించి, ఆ స్థానాల్లో పురుషులను నియమించే పరిస్థితికి దారితీసిందని విచారణ బృందం స్పష్టం చేసింది.

నిర్వహణ వైఫల్యమే ప్రధాన కారణం

సందర్శన సమయంలో మహిళా సిబ్బందిని మినహాయించడం వాస్తవమే అయినప్పటికీ, అది కేవలం టవర్ నిర్వహణ గొలుసులోని పొరపాట్ల వల్లే జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమన్వయ, నిర్వహణ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఈఫిల్ టవర్ నిర్వాహక సంస్థ (SETE) అధిపతి పాట్రిక్ బ్రాంకో రూయివో ఈ ఏడాది చివర్లో తన పదవి నుంచి తప్పుకోనున్నారు.

ఈ పరిణామాలపై బీఏపీఎస్ సంస్థ స్పందించింది. మహిళలను దాచాలని లేదా విధుల నుంచి తొలగించాలని తాము ఎప్పుడూ కోరలేదని విచారణలో నిర్ధారణ కావడాన్ని స్వాగతించింది. అయితే ఈఫిల్ టవర్ నిర్వహణ లోపం వల్ల స్థానిక మహిళా సిబ్బందికి కలిగిన మానసిక బాధకు, అసౌకర్యానికి సంస్థ ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp