|  
● FLASH NEWS
Cricket: తిలక్ శతకం వృథా.. పాక్ ‘ఏ’ చేతిలో భారత్ ‘ఏ’ ఓటమి  •  Eluru: ఆలయంలో షూస్‌తో ప్రవేశం.. అర్చకుడిపై దాడి ఆరోపణలు  •  Crime: జపాన్ మహిళపై లైంగిక దాడి ఆరోపణలు.. యోగా కేంద్రం నిర్వాహకుడి అరెస్ట్  •  Jabardasth: రోడ్డు ప్రమాదంలో దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు  •  Test: న్యూజిలాండ్‌పై భారత్ పరుగుల సునామీ.. 720/9తో భారీ ఆధిక్యం  •  Canada: కెనడాలో ఇద్దరి కాల్చివేత.. వెలుగులోకి సంచలన విషయాలు!  • 
Skip to content

BRS: చెరువుగట్టు నుంచి ఫామ్‌హౌస్ పాదయాత్ర విజయవంతం.. హరీష్ రావుతో గుండాల మల్లేష్ గౌడ్ భేటీ!

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, 2029లో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నకిరేకల్ నియోజకవర్గంలోని చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండాల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర విజయవంతమైన నేపథ్యంలో ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి యాత్ర విశేషాలను వివరించారు.

చెరువుగట్టు నుంచి ఎర్రవెల్లి వరకు పాదయాత్రలో పాల్గొన్న బృందం

యువతను మేల్కొలిపి పార్టీని బలోపేతం చేయాలి: హరీష్ రావు

పాదయాత్ర బృందాన్ని అభినందించిన సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, యాత్ర సాగిన తీరుపై గుండాల మల్లేష్ గౌడ్‌తో చర్చించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, నాయకులు గ్రామాల బాట పట్టి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ యువతను మేల్కొలపాలని, రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

పలువురు ముఖ్య నేతలతో పాదయాత్ర బృందం భేటీ

హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లను గుండాల మల్లేష్ గౌడ్ బృందం కలిసింది. చెరువుగట్టు ఆలయం వద్ద ప్రారంభమైన నాటి నుంచి ఎర్రవెల్లి వరకు సాగిన పాదయాత్రకు ప్రజల నుంచి లభించిన స్పందనను, యాత్ర ఉద్దేశాలను నాయకులకు వివరించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నేతలు అభినందించారు.

బీఆర్ఎస్ నాయకులతో పాదయాత్ర బృందం సమావేశం

పాదయాత్రలో పాల్గొన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు

నవంబర్ 15న చెరువుగట్టు స్వామివారి ఆశీర్వాదంతో మొదలైన ఈ పాదయాత్రలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. ముఖ్యంగా మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్గొండ, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, పాదయాత్ర బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ నాయకత్వానికి తమ మద్దతును చాటుకున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Tags: