
చెన్నై, సూర్య న్యూస్ : భారతీయ చిత్రసీమలో ప్రయోగాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) కన్నుమూశారు. వయోభారంతో అనారోగ్యానికి గురైన ఆయన, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో (Kauvery Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సింగీతం ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా ‘పుష్పక విమానం’, ‘అపూర్వ సహోదరులు’, ‘భైరవ ద్వీపం’ వంటి ఎన్నో సంచలనాత్మక చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అలాగే, నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘ఆదిత్య 369’ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
వయసు మీద పడినా సినిమాపై ఉన్న మక్కువతో ఆయన తన 94 ఏళ్ల వయసులోనూ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



