|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

Nayanthara : ఆ స్టార్ హీరో సినిమాలో నటించి నా జీవితంలో అతిపెద్ద తప్పు చేశా.. నయన్ షాకింగ్ కామెంట్స్!

nayanthara shocking comments star hero movie surya news
nayanthara shocking comments star hero movie surya news

హైదరాబాద్, సూర్య న్యూస్ : సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ (Lady Superstar) నయనతార (Nayanthara) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రస్తుత తరుణంలో నయనతార గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కెరీర్ లో తీసుకున్న చెత్త నిర్ణయం అదే..

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ రంగంలోకి అడుగుపెట్టిన నయనతార తన కృషితో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తూ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అగ్ర హీరోలతో కలిసి నటించిన ఆమె తన కెరీర్ లో ఒక సినిమా చేసి తప్పు చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాలో నటించడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం అని ఆమె ఆ పాత ఇంటర్వ్యూలో తీవ్ర స్థాయిలో పేర్కొన్నారు.

​ఆ సినిమాతో మోసపోయా…

నయనతార అంతలా బాధపడిన ఆ సినిమా 2005లో సూర్య హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘గజిని’. ఆ సినిమాలో అసిన్ ప్రధాన కథానాయికగా నటించగా నయనతార సెకండ్ హీరోయిన్ గా కనిపించారు. అయితే ఆ సినిమా విషయంలో తనకు చెప్పిన విధంగా కాకుండా తెరపై తన పాత్రను వేరేలా చూపించారని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా తనను మోసం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ విషయం తనను ఎంతో బాధించిందని స్పష్టం చేశారు. గజిని సినిమా చేసి తప్పు చేశానని ఆమె గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp