|  
FLASH NEWS
Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?  •  Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ  •  Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  • 
Skip to content

Alla Nani Funeral: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్థివ దేహానికి నారా లోకేష్ నివాళులు

ఏలూరు, సూర్య న్యూస్ :​ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (Alla Nani) అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఏలూరు వచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేశ్ కుమార్ కూడా పాల్గొని అశ్రునివాళులు అర్పించారు.

అనంతరం వారు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఆళ్ల నాని మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు కోరుకున్నారు.

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అలాగే ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అక్కడకు చేరుకున్నారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తో పాటు పలువురు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp