|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!

అమరావతి, సూర్య న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Deep Depression) ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. నేడు విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఉత్తరాంధ్రలో కుండపోత.. ఆకస్మిక వరద ముప్పు

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందంటూ ఐఎండీ అధికారులు ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

కోస్తా జిల్లాల్లోనూ కురుస్తున్న వానలు

ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పలు కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp