|  
FLASH NEWS
Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  •  NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  • 
Skip to content

Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు (Danam Nagender) సుప్రీంకోర్టులో (Supreme Court) భారీ చుక్కెదురైంది. ఆయనపై రాష్ట్ర హైకోర్టు వేసిన అనర్హత వేటును కొట్టేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు ఖరారైంది.

ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అనర్హత వేటు పడిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.

నేపథ్యం ఇదీ..

దానం నాగేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బి ఫామ్ తో పోటీ చేశారనే కారణంతో హైకోర్టు ఆయనపై డిస్ క్వాలిఫికేషన్ వేటు వేసింది.

​ఈ మేరకు 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఎమ్మెల్యేగా ఆయన అనర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన అనర్హత వేటును ఎత్తివేయాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దానం అభ్యర్థనను తోసిపుచ్చింది. చట్టప్రకారం ఆయన వ్యవహరించిన తీరును తప్పుబడుతూ హైకోర్టు తీర్పును సమర్థించింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp