
హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యూజిలాండ్‌తో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌కు (T20 Series) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా జట్టును ప్రకటించింది. ఈ జట్టులో దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మరో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి కూడా జట్టులోకి రీఎంట్రీ కల్పించాలనే డిమాండ్ క్రికెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు న్యూజిలాండ్ వేదికగా కివీస్‌తో భారత్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మందితో కూడిన యువ జట్టును ఎంపిక చేసింది. యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్‌లతో పాటు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పునరాగమనం చేయడంతో భారత పేస్ దళం ఆసక్తికరంగా మారింది.
2027 వరల్డ్ కప్ లక్ష్యంగా.. షమీకి పిలుపునిచ్చేనా?
భువనేశ్వర్ ఎంపికతో ఇప్పుడు క్రీడా విశ్లేషకులు, అభిమానుల దృష్టి మహ్మద్ షమీ వైపు మళ్లింది. షమీ చివరిసారిగా 2025 మార్చిలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ, దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఫామ్ నిరూపించుకుంటున్నాడు.
ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుంటే, అనుభవజ్ఞుడైన షమీ సేవలు భారత జట్టుకు ఎంతో అవసరమని క్రీడాభిమానులు విశ్లేషిస్తున్నారు. దేశవాళీలో సత్తా చాటుతున్న అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకుంటే బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
కివీస్‌తో తలపడే భారత జట్టు ఇదే
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ రెడ్డి, నమన్ ధీర్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



