|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

Bathukamma: కుల మతాలకు సంబంధం లేని సంబురమే బతుకమ్మ పండగ – BRAOU వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (BRAOU) బతుకమ్మ (Bathukamma) వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. క్యాంపస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సంబురాల్లో విశ్వవిద్యాలయ మహిళా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మహిళలంతా సమిష్టిగా జరుపుకునే గొప్ప పూల పండుగ బతుకమ్మ అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి, మహిళా విభాగపు ఇంచార్జ్ ప్రొఫెసర్ కె. రాణి రజిత మాధురి మహిళా సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పల్లవి కబ్డే, ప్రొఫెసర్ రజని, ప్రొఫెసర్ చంద్రకళ, డాక్టర్ ఎ. రమాదేవి తదితరులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, డాక్టర్ యాకేష్ దైద, పాండు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp