
హైదరాబాద్, సూర్య న్యూస్ : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (BRAOU) శనివారం “రాష్ట్రీయ ఏక్తా దివస్” (జాతీయ ఐక్యతా దినోత్సవం) ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆదేశాల మేరకు వర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటంతో పాటు వాటిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉద్యోగులందరూ సమష్టిగా “రాష్ట్రీయ ఏక్తా దివస్” ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాంగణంలో నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” ర్యాలీలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ప్రతిజ్ఞ
కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు వర్సిటీలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం “సమగ్రతతో సమృద్ధి” అనే అంశంపై కార్యక్రమం చేపట్టారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ్ కృష్ణారెడ్డి ఉద్యోగులతో “అవినీతిపై పోరాటం – నిజాయితీ ప్రతిజ్ఞ” (Fight Against Corruption – Integrity Pledge) చేయించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, నిజాయితీ, నైతిక విలువలను పాటిస్తామని, కార్యాలయంలో తమ విధులను పారదర్శకతతో నిబద్ధతతో నిర్వహిస్తామని ఉద్యోగులంతా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమాల్లో వర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్పా చక్రపాణి, ప్రొఫెసర్లు కె. రాణి రజిత మాధురి, ప్రమీలా కేతావత్, మేరీ సునంద, వెంకట రమణ, డాక్టర్ వై. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన మరియు బోధనేతర సంఘాల ప్రతినిధులు కె. ప్రేమ్ కుమార్, మియా జానీ, మంజుల, భరత్ రెడ్డి, డాక్టర్ యాకేష్ దైదాతో పాటు పలువురు ఉద్యోగులు హాజరయ్యారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



