|  
● FLASH NEWS
Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  •  KCR: కేసీఆర్ పాదయాత్ర.. అంతటి స్థాయి ఉన్న లీడర్‌కు ఇది అవసరమా?  •  Trump: రష్యా డీజిల్ డీల్‌పై జెలెన్‌స్కీ ఫైర్.. అమెరికా తీరుపై ఉక్రెయిన్ అసంతృప్తి  • 
Skip to content

TGSRTC: భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్ ఛార్జీలా? ఆర్టీసీ బాదుడుపై హరీష్ రావు ఫైర్

హైదరాబాద్, సూర్య న్యూస్ : పండుగల సమయంలో తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం మోపడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ వెళ్లే బస్సులో డబుల్ ఛార్జీలు వసూలు చేశారంటూ ఓ ప్రయాణికుడి టికెట్‌ను సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో షేర్ చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శల వర్షం కురిపించారు.

సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు బస్సు టికెట్ ధర రూ.230 ఉండగా, పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఏకంగా రూ.400 వసూలు చేయడం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భార్యకు ఫ్రీ టికెట్ ఇచ్చి, భర్త నుంచి ఏకంగా డబుల్ టికెట్ వసూలు చేస్తోందా అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఇలా రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడం ద్వారా మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ ఆర్థిక భారాన్ని పరోక్షంగా మళ్లీ అదే కుటుంబంపై మోపినట్టా? అని ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీశారు. ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఈ అదనపు ఛార్జీల దోపిడీని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఆర్టీసీ టికెట్ వివాదం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp