|  
● FLASH NEWS
BRAOU: మలేషియా సదస్సులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులపై చర్చ  •  Diplomacy: జైశంకర్ దౌత్య వ్యూహం.. యూఎస్ విదేశాంగ మంత్రి ముందే పాక్ గుట్టు రట్టు  •  SupremeCourt: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువుపై కీలక ఆదేశాలు  •  PayalRajput: నా శరీరం నా ఇష్టం.. ట్రోలర్స్‌పై మండిపడ్డ హీరోయిన్ పాయల్  •  Warning: రౌడీలు, సోషల్ మీడియా సైకోల తాట తీయాలి.. పోలీసులకు సీఎం చంద్రబాబు వార్నింగ్  • 
Skip to content

BRAOU: మలేషియా సదస్సులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులపై చర్చ

హైదరాబాద్, సూర్య న్యూస్ : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) అందిస్తున్న ఆన్‌లైన్ కోర్సుల (Online Courses) ద్వారా విద్యార్థులు భౌగోళిక పరిమితులతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఆ యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్పా చక్రపాణి తెలిపారు. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆమె యూనివర్సిటీ విద్యా విధానాలను ప్రతినిధులకు వివరించారు.

కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్, ఓపెన్ యూనివర్సిటీ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో ‘విద్యలో ఫ్రుగల్ ఏఐ’ అనే అంశంపై ఈ అంతర్జాతీయ వర్క్‌షాప్ జరిగింది. ఈ సదస్సుకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రతినిధులుగా ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, ఎడ్‌టెక్ మేనేజర్ సుషుమ్న రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చిన్న నమూనాలు – అపార అవకాశాలు: వర్సిటీలో ఫ్రుగల్ ఏఐ అన్వేషణ’ అనే అంశంపై ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి ప్రత్యేకంగా ప్రసంగించారు. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారంపై చర్చించారు.

మలేషియా తెలుగు అసోసియేషన్‌తో భేటీ

ఈ పర్యటనలో భాగంగా మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధి సత్యా సుధాకరన్ తో యూనివర్సిటీ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. అంబేద్కర్ వర్సిటీ అందిస్తున్న బి.కాం, ఎం.కాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు తదితర ఆన్‌లైన్ కోర్సుల వివరాలను వారికి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఉన్నత విద్యావకాశాలను మరింత చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Prof. G. Pushpa Chakrapani and Smt. Sushumna Rao in a meeting with Malaysia Telugu Association representative, Mr. Satya Sudhakaran.
Prof. G. Pushpa Chakrapani and Smt. Sushumna Rao in a meeting with Malaysia Telugu Association representative, Mr. Satya Sudhakaran.

ఆన్‌లైన్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే ఈ సదుపాయం మలేషియాలో నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటుందని మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధి సత్యా సుధాకరన్ అభిప్రాయపడ్డారు. మలేషియాలోని తెలుగు వారందరికీ ఈ ఆన్‌లైన్ కోర్సుల వివరాలను చేరవేసి, వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp