
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Dr. B.R. Ambedkar Open University) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్పా చక్రపాణి అధికారికంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.
యూనివర్సిటీ అందిస్తున్న బి.కామ్ (తెలుగు, ఇంగ్లీష్ మీడియం), ఎం.కామ్ (ఇంగ్లీష్ మీడియం), ఎం.ఏ (తెలుగు), ఎం.బి.ఏ (ఇంగ్లీష్ మీడియం) కోర్సుల్లో ఆన్‌లైన్ విధానం ద్వారా విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆన్‌లైన్ కోర్సులకు తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలిపారు.
దేశ, విదేశాల్లోని ఎన్నారై (NRI) విద్యార్థులు కూడా ఈ ఆన్‌లైన్ కోర్సుల్లో చేరేందుకు అర్హులని అకాడమిక్ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అడ్మిషన్ మరియు ట్యూషన్ ఫీజులను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఇతర ఆన్‌లైన్ చెల్లింపు విధానాల ద్వారా సులభంగా చెల్లించవచ్చని తెలిపారు.
అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాస్పెక్టస్ కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్లు www.braouonline.in లేదా www.braou.ac.in ను సందర్శించాలని సూచించారు. ఆన్‌లైన్ కోర్సుల ప్రవేశాలపై ఏవైనా సందేహాలు ఉంటే వర్సిటీ టోల్ ఫ్రీ నెంబర్ 18005990101 లేదా హెల్ప్ డెస్క్ నెంబర్లు 040-23680222, 040-23680333, 040-23680555 లను సంప్రదించవచ్చని ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి ఆ ప్రకటనలో వివరించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



