|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

BRAOU Online Courses : డిజిటల్ యుగంలోకి అంబేద్కర్ వర్సిటీ.. 4 ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, సూర్య న్యూస్ : దేశంలోనే మొట్ట మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం అయిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) డిజిటల్ విద్యా విధానం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యను విద్యార్థులకు చేరువ చేసేందుకు వర్సిటీ చేసిన ప్రయత్నాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అధికారికంగా ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నాలుగు కోర్సులను పూర్తి ఆన్‌లైన్ విధానంలో (Online Courses) అందించడానికి యూజీసీ అనుమతి మంజూరు చేసింది.

సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్పా చక్రపాణి ఈ అడ్మిషన్ల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 8 కోర్సులకు అనుమతి కోరగా, అందులో నాలుగు కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమోదం పొందిన వాటిలో ఎం.ఏ. తెలుగు (M.A. Telugu), ఎం.కామ్ (M.Com), బి.కామ్ ఇంగ్లీష్ మీడియం (B.Com English Medium ), బి.కామ్ తెలుగు మీడియం (B.Com Telugu Medium) కోర్సులు ఉన్నాయి. మిగిలిన నాలుగు ప్రోగ్రామ్‌లకు సంబంధించి యూజీసీ చేసిన సూచనలను పూర్తి చేసి, త్వరలోనే వాటికి కూడా అనుమతి సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

యూజీసీ ఆమోదం లభించడం పట్ల విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ (VC) ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కెనడా అధికారిక పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే అధికారులతో ఫోన్లో మాట్లాడి సిబ్బందిని అభినందించారు. దేశంలోనే తొలి డిస్టెన్స్ యూనివర్సిటీగా (Distance University) ప్రారంభమైన అంబేద్కర్ వర్సిటీ, ఇప్పుడు పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పాలక మండలి సహకారంతో రానున్న రోజుల్లో అన్ని కోర్సులను టెక్నాలజీ సాయంతో ఆన్లైన్ కోర్సులుగా మారుస్తామని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, ఇతర డీన్స్ స్వాగతించారు.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత సరళంగా అందుబాటులోకి తీసుకురావాలని యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. యూజీసీ కొత్తగా ఆమోదం తెలిపిన ఈ కోర్సుల ఫీజులు, కనీస అర్హతలు, అడ్మిషన్ విధానం, కోర్సు వ్యవధి వివరాలతో త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ (Admission Notification) విడుదల కానుంది.

పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లు www.braou.ac.in లేదా www.braouonline.in ను సందర్శించవచ్చు. అలాగే సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ నెంబర్లు 040 – 23680 333 / 555 లేదా టోల్-ఫ్రీ నెంబర్ (Toll-Free) 1800-599-0101 కు కాల్ చేసి సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp