రిపోర్టర్: Surya news


న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులకు, వ్యాపారులకు కేంద్రం త్వరలోనే షాక్ ఇవ్వబోతోంది. దీపావళి పండుగ సీజన్ ముగియడంతో యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది.
అక్టోబర్ 15 నుంచే ఈ ఛార్జీలను అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భావించినప్పటికీ, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు పండుగ సీజన్ ముగిసే వరకు వాయిదా వేసింది. నిబంధనల ప్రకారం.. ఒక దుకాణంలో రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు జరిగితే, దుకాణాదారులు ఆ మొత్తంపై 0.4 శాతం ఎండీఆర్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త ఛార్జీలు ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



